Medidoddi Madhavi Elected Wanaparthy Municipal Chairperson
వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్
,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S
