Madannapet Road Gets Major Upgrade
మాదన్నపేట రోడ్డుకు మహార్దశ
60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో వెడెల్పు పనులు ప్రారంభం
రోడ్డు వెడల్పులో పాల్గొన్న టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి అధికారులు
రోడ్డు వెడల్పు నిర్మాణం పనులు ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్న దుకాణాల యజమాన్యం?
అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..ప్రజల డిమాండ్..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో
ఏండ్ల తరబడి సమస్యల వలయంలో ఉన్న మాదన్నపేట రోడ్డు వెడల్పుకు మహార్దశ వచ్చింది.రోడ్డు వెడల్పు కోసం సంబంధిత మున్సిపల్, రోడ్ల భవనాల శాఖ అధికారులు మార్కింగ్ వేసిన రోజే… ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కొందరు వ్యాపారులు కోర్టుమెట్లు ఎక్కడ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం?.
వరంగల్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మున్సిపాలిటీ నర్సంపేట కావడం ఇక్కడ అన్ని విధాల వ్యాపారాలు

జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల నర్సంపేట చుట్టూ రూరల్ 8 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేట పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేట రోడ్డు గతంలో పాత బస్టాండ్ గా
పిలువబడుతున్నది.

ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడం ఇరుకుగా ఉండడంతో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులతో సమీక్ష చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కానీ కొన్ని అనివార్య కారణాల వలన అయితే ఇటీవల

నాగూర్లపల్లె,మాదన్నపేట గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో కలవడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు.అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుండి మాదన్నపేట మీదుగా నల్లబెల్లి మండలం వరకు 10 మీటర్ల తారు రోడ్లు వేసేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఐతే రోడ్డు వెడల్పు లేక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.ఈ రోడ్డు వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండడం మూలంగా బారీ వాహనాలు,ఇతర వాహనాలు నిలవడం వలన అంతరాయం వాటిల్లేది.అలాగే చిన్నపాటి వర్షం పడ్డ ఆ రోడ్డు మొత్తం జలమయం,బురదమయం ఐతుండేది.ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు
చేసేందుకు గాను సోమవారం మున్సిపల్ శాఖ,రోడ్ల భవనాల శాఖ అధికారులు మొత్తం 60 ఫీట్లకు మార్కింగ్ చేశారు.గతంలో రోడ్డుకు మిడిల్ పాయింట్ గా రెండు వైపుల 30 రోడ్డును సరిచేస్తూ బౌండరీలకు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో బ్రాహ్మకుమారి ఆశ్రమం సమీపం నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు కొన్ని వ్యాపార సముదాలను
తొలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అదే రోడ్డు వాటర్ ప్లాంటు నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల నుండి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే తేలుతుండడంతో ఆ ప్రాంత వ్యాపారస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. 60 ఫీట్ల కుదిరించేందుకుగాను కొందరు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లగా ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారీ కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.వ్యాపారుల ఎత్తుగడలను తలొగ్గిన అధికారులు వాటర్ ప్లాంట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా రోడ్డు వెడల్పు కోసం పెద్ద చిన్న అని తేడా లేకుండా పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలనిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎలాగైనా రోడ్డు వెడల్పును ఆపేందుకు కొందరు వ్యాపారులు కోర్టు నుండి స్టే తెచ్చుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కేందుకు సమావేశమైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రోడ్డుకు మార్కింగ్ చేసే సమయంలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్న ఒక భవనం నిర్మాణం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్నట్టు గుర్తించడంతో యజమాని మున్సిపాలిటీ అధికారులతో ప్రయత్నం చేయగా ఇండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కమిషనర్ ను సంప్రదిస్తే ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంటు ప్రకారంగా రోడ్డు బౌండరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేస్తున్న రోడ్డు వివిధ రకాల పలుకుబడులతో రోడ్డును కుదించే ప్రయత్నాలు చేయకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాదన్నపేట రోడ్డు పరిధిలోగల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
ప్రారంభమైన రోడ్డు వెడల్పు పనులు..
పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు బుధవారం ప్రారంభం చేశారు. అయితే రోడ్డు వెడల్పు పనులను ప్రారంభ పనుల నుండి కాకుండా స్మశాన వాటిక సమీప నుండి పనులను ప్రారంభించడంపై అధికారులపై ప్రజలు తీవ్ర నిరాశ ఎదురైతున్నది. ఇప్పటికైనా అందరికీ సమాన న్యాయం జరగాలంటే పూర్తిస్థాయిలో 60 ఫీట్ల వెడల్పు రోడ్డును నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
