కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మదన్ లాల్.

కారేపల్లి నేటి ధాత్రి

కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామపంచాయతీ లో శన్నంగలగడ్డ ,గుంపెల్లగూడెం, చిన్న కట్టుగూడెం, పేరేపల్లి గ్రామపంచాయతీలో జమాలపల్లి ,రావోజి తండా ,గ్రామపంచాయతీలో మల్లన్న గూడెం, రావోజితండా, మున్యతండ, అప్పయి గూడెం గ్రామపంచాయతీలో తులసి తండా ,బిక్య తండా ,అపాయి గూడెం, సూర్య తండా గ్రామపంచాయతీలో చండ్రలగూడెం ,గుట్ట కింద గుంపు, గ్రామపంచాయతీ భాగ్యనగర్ తండ ,గ్రామపంచాయతీ పోలంపల్లి గ్రామపంచాయతీలలో వైరా బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో ముందుగా గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మదన్ లాల్ కు భారీ సంఖ్యలో గ్రామాలలో ప్రజలు తిలకందిద్ది, హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతూ పూలమాలతో ,నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాములు నాయక్ తో మదన్ లాల్ చెయ్యిలో చెయ్యేసి తన వెంబడి పలు గ్రామాలలో పర్యటించారు. గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రజానీకం భారీ సంఖ్యలో తరలివచ్చి జై తెలంగాణ జై జై తెలంగాణ జై మదన్ లాల్ జై జై మదన్ లాల్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ మదన్ లాల్ ను ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ నాయకత్వం వహిస్తారని కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు పొందాలని సూచించారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రంలో లేవని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు అదృష్టంగా భావించి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు.

మదన్ లాల్ మాట్లాడుతూ

కారేపల్లి మండలంలో భారీ మెజార్టీ అందిస్తారని కారేపల్లి మండలం తనకు కన్నతల్లితో సమానమని అన్నారు. గత ఎన్నికల్లో కారేపల్లి మండలం నుంచి మెజార్టీ అందించారని ఎన్నికల్లో కూడా మండలం నుంచి భారీ మెజార్టీ అందించి గెలుపుకు శ్రీకారం చుట్టాలని అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచేది నేనేనని గెలిచిన తర్వాత మీ గ్రామాలలో అభివృద్ధి చేసేది నేనేనని అన్నారు. ఎన్నికల్లో గెలిపించి తీరితే గ్రామ అభివృద్ధి బాధ్యత నాదేనని మరి ఇతర పార్టీలను నమ్మవద్దని కేవలం ఎన్నికల్లో వాడుకోవడానికి మీ ముందుకు వస్తారని గెలిచిన తర్వాత మొహం కూడా చూపించారని మదన్ లాల్ మాట ఇస్తే తప్పడని అభివృద్ధికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని ప్రజలకు మాటిచ్చారు. ఆయా గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంగా గ్రామాలలో ఉన్న సమస్యలను మదన్ లాల్ కు తెలపడంతో గెలిచిన వెంటనే గ్రామాలకు నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ గెలిచాక తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసిఆర్ దని తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రంలో లేవని ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు పొందారని గత పాలకులు సంక్షేమ పథకాలు ఇంత అద్భుతంగా అందించలేదని అన్నారు. బి ఆర్ ఎస్ మేనిఫెస్టో గ్రామ గ్రామాన తెలుపుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మేనిఫెస్టో అమలవుతుందని అన్నారు. స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. మీరు వేసే ఓటు తోనే తన భవిష్యత్తు ఏర్పడుతుందని ఎన్నికల్లో తప్పక గెలిస్తే ప్రజా చేసే నా శ్రేయస్సు గా భావించి అభివృద్ధికి శ్రీకారం చుడతానని తన గొంతులో ఊపిరి ఉన్నంతవరకు ప్రజా శ్రేయస్సు చేస్తానని మాట ఇస్తే తప్పని అన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు గ్రామాలలో తిరుగుతూ బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో ప్రచారం చేయాలని ప్రజలకు సంక్షేమ పథకాలు గడపగడపకు తెలుపుతూ గ్రామాలలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్, అధ్యక్షులు పెద్ద బోయిన ఉమా శంకర్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాస్, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, తోటకూరి పిచ్చయ్య, ఎంపీపీ శకుంతల, సర్పంచ్ కిషోర్, కుమార్, నాగేశ్వరరావు,రోశయ్య, ఎంపీటీసీ టు 2 జడల వసంత, వెంకటేశ్వర్లు, పదవ వార్డు సభ్యులు గౌసుద్దీన్,రామ్ కిషోర్, బత్తుల శ్రీనివాస్, లాకావత్ రాము, హనీఫ్, సర్పంచులు ,ఎంపీటీసీలు ,ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!