# పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
# భయాందోళనలో వార్డు ప్రజలు.
# 1 వ వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆ వార్డు దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిచ్చి కుక్కలు వలన తల్లిదండ్రులు వారి పిల్లలను బయటికి పంపాలంటే భయాందోళనకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం వార్డులోని ప్రజలు పిచ్చికుక్కల వలన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి నెలకొన్నది పేర్కొన్నారు.వార్డులో పిచ్చికుక్కలు మరియు పందులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.గత మూడు నెలల క్రితమే కుక్కలను పట్టడం జరిగిందని మున్సిపాలిటి బిల్లులో 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగిందని అధికారులు తెలుపుతున్నానని ఆరోపించారు.ఇప్పటి వరకు తమ 1వ వార్డులో మాత్రం ఒక పిచ్చికుక్కని పట్టుకున్న దాఖలాలు మాత్రం లేవని పేర్కొన్నారు. పిచ్చికుక్కలు,పందుల బెడద నుండి కాపాడాలంటూ స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి వార్డులో ఉన్న సమస్యల పట్ల దృష్టిస్తారించాలని వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం కోరారు.