Mad Dog Attacks 4 People in 15 Seconds
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
భోపాల్, ఏప్రిల్ 5: మధ్య ప్రదేశ్లోని కేవ్తీ గ్రామంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఇంటి ఆవరణలో ఓ ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. పిచ్చి కుక్క అటు వైపు వచ్చింది. నేరుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అతడి మీదకు ఎగిరి దూకి దాడి చేయడానికి ప్రయత్నించింది.
