Machnoor Seed Bank Wins National Award
మచ్నూర్ సీడ్ బ్యాంకు జాతీయ అవార్డు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన ఝరాసంగం మండలం మచ్నూర్ గ్రామం లోని కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ కు భారత ప్రభుత్వం ప్లాంట్ జెనమ్ సేవి యర్ కమ్యూనిటీ అవార్డు 2022-23 లభించింది. బుధవారం న్యూఢిల్లీ భారతరత్న సి. సుబ్రమణ్యం కన్వెన్షన్ సెంటర్లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవార్డును అందించారు. ఈ గౌరవం మూడు దశాబ్దాలుగా సంప్రదాయ విత్తనాలను పరిరక్షించి జీవవైవిధ్యాన్ని కాపాడిన డిడిఎస్ మహిళా రైతుల కృషిని అభినందించారు.
