భద్రాచలం నేటి దాత్రి
13మందితో మండలకవిుటి ఎన్నిక
-మండలసమస్యలపై తీర్మాణలు
-పోరాటలకు,ప్రజలను సిద్ధంచేయాలని
పార్టీశ్రేణులకు పార్టీపిలుపు
చర్ల: సిపిఐ(ఎం) మండల కార్యదర్శిగా మచ్చా రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ చర్ల మండలం తొమ్మిదవ మహాసభలు మండల కమిటీని 13 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల కార్యదర్శిగా మచ్చా రామారావు ఎన్నికయ్యారు మండల కమిటీ సభ్యులుగా కారం నరేష్, పొడుపుగంటి సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, దొడ్డి హరినాగ వర్మ ,పామరు బాలాజీ,
బి .నవీన్, రాధాకుమారి , విజయశీల, శ్యామల చంద్రం, షారోని ,వరలక్ష్మి,ఎన్నికయ్యరు.
-మండల అభివృర్ధికి సమరశీలపోరాలు
-ప్రజాసమస్యలపై తీర్మాణాలు అమెాదించిన మహాసభ
చర్ల మండలంలో ప్రజల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రానున్న కాలంలో సమరశీల పోరాటాలు చేయాలని అందుకు ప్రజల్ని సమాయత్తం చేసే దిశగా పార్టీ శ్రేణులు గ్రామస్థాయి వరకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేయాలని సిపిఎం చర్ల మండలం తొమ్మిదవ మహాసభ పిలుపునిచ్చింది. మండల అభివృద్ధి కోసం పలు కీలకమైన ప్రజా సమస్యలపై మహాసభ తీర్మానాలను ఆమోదించటం జరిగింది .ఈ తీర్మానాలు ఆధారంగా భవిష్యత్ పోరాటాలను నిర్వహించాలని మహాసభ నిర్ణయించింది.మండలంలో పోడు భూమి పట్టాలు పొందిన రైతులందరికీ త్రీఫేస్ విద్యుత్తు లైను ఏర్పాటు చేసి వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలి.చర్ల లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలి .చర్ల సిహెచ్ ,కొయ్యూరు పి హెచ్చ్ సి, సత్యనారాయణపురం పిహెచ్చ్ సి లో ఖాళీగా ఉన్న
డాక్టర్లను ,
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. వద్దిపేట చెక్ డాం నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కోరేగడ్డ లంక భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లించాలి .గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలకు మేరక ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి.పూసుగుప్పలో ,చిన్నవిుడిసిలేరులో తాలిపేరు పై లిప్టుఇరిగేషన్ స్కీమ్లు లు ఏర్పాటుచేయాలి.చింతగుప్ప చెక్ డ్యామ్ రిపేర్లకు నిధులు కేటాయించాలి.చర్లమండలకేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి.ప్రజల నివాసాలకు దగ్గరగావున్న చర్లడంపింగ్ యార్డు తొలగించి దూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.మండలంలో ఇసుక ర్యాంపులలో జరుగుతున్న
అక్రమాలపై సమగ్రవిచారణ జరపాలి.
ఇసుక ర్యాంపుల నిర్వాహణ పై సామాజిక తనికిచేయాలి.ఈతవాగుపై హైలెవల్ వంతెన నిర్మించాలి.రైతుబందుడబ్బులు రైతులఅకౌట్లలో జమచేయలి.
బుుణమాఫీకాని రైతులకు 2లక్షలరూపాయలు బుుణ మాఫిని అమలుచేయాలి.
ఈతీర్మాలఆదారంగా మండలంలో ప్రజాసమస్యలపై సిపి ఐ(యం)
పోరాటలు చేస్తుందని ఈపోరాటాలను ప్రజలు బలపరచాలని విజ్ఞప్తిచేశారు.