అప్పులు తేలేక తల్లడిల్లుతున్న కార్మికులు
పట్టించుకోని అధికారులు.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా బిల్లులు అందడం లేదు. పేద విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే మధ్యాహ్న భోజన పథకం మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక సహకారాలు చేస్తున్న ప్రకారం బిల్లులు చెల్లించడం లేదు. ప్రతినెల అప్పులు తెచ్చి పెడుతున్నాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద గుడ్డుకు నాలుగు రూపాయలు చొప్పున కట్టించి నెలకు 30 వేల రూపాయలు అవుతుంది 6 నెలలు అంటే 1,80,000 అవుతుంది మాకు అప్పులు తెచ్చి పెట్టడం వల్ల కుటుంబం అప్పుల పాలు కావడం జరుగుతుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులకు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అంతేగాక ప్రభుత్వం ఉచితంగానే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాధమ్మ ,సునీత, కట్ట మల్లమ్మ శారదమ్మ అనేకమంది పాల్గొన్నారు.