Lucky Draw at Vinayaka Fuel Station
వినాయక ఫీలింగ్ స్టేషన్లో లక్కీ డ్రా
* ముగ్గురు విజేతలకి బహుమతులు
మహాదేవపూర్ నవంబర్ 10(నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని శ్రీవినాయక ఫీలింగ్ స్టేషన్ లో ఆదివారం రోజున లక్కీ డ్రా తీయడం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన నూతనంగా ప్రారంభించిన వినాయక ఫీలింగ్ స్టేషన్ లో వినియోగదారులకు సత్సంబంధాలు మెరుగుపడే విధంగా ఒక వినూత్న ఆలోచనతో వినియోగదారుల ఆదరాభిమానాలు చోరకొనేలా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రా లో యాజమాన్యంతో పాటు ప్రజల ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించగా మొదటి బహుమతి ఒక గ్రామ్ బంగారం ను సూరారం గ్రామానికి చెందిన సోదరి మల్లయ్య గెలుపొందాడు, రెండో బహుమతి ఆండ్రాయిడ్ మొబైల్ ను రత్న లచ్చిరెడ్డి గెలుపొందాడు, మూడో బహుమతి మిక్సర్ గ్రైండర్ ను రాపెల్లి కోట గ్రామానికి చెందిన చల్ల అనిల్ గెలుపొందాడు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
