హసన్ పర్తి / నేటి ధాత్రీ
ఎన్నికలప్పుడు ఎల్ ఆర్ ఎస్ ఉచితమంటూ
మాటిచ్చి ఇప్పుడు తప్పితే ఊరుకోం నిన్న ఎల్ ఆర్ ఎస్ ఫ్రీ..అన్నది కాంగ్రెస్ అధికారమిస్తే ఎల్ ఆర్ ఎస్ ఫీజు.. ఫీజు అంటోంది
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ నిరసన కార్యక్రమం చెపట్టారు.
ఈ సందర్భంగా ఆరూరి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి 20వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది అప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ,ఇప్పుడు నోరు ఎందుకు తెరవడం లేదు.
ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలి
అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో ప్రజలకు చెప్పాలి ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనున్నదికాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఇప్పటికైనా ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ ఆర్ ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…