
ఒక షాపు రెండు కౌంటర్లు…
ఇటువైపు చూడని ఎక్సైజ్ శాఖ అధికారులు.. టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు..
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
:కరకగూడెం మండలంలో మద్యం దం దా జోరుగా కొనసాగుతుంది అని టిడిపి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక షాపు పేరుతో ముందువైపు రిటైల్ వెనకవైపు హోల్సేల్ నడిపిస్తూన్నారు. బినామీ పేర్లతో మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కినారు ఎవరికి షాపు వస్తుందో వారి మెయింటినెన్స్ చేయాలి అని గత లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోని దళారులు సిండికేట్ ఏర్పడి మద్యం మందుబాబులకి చుక్కలు చూపిస్తున్న మద్యం వ్యాపారులు ఒక కోటర్ 20 రూపాయలు ఫుల్ బాటిల్ 80 రూపాయలు బెల్ట్ షాపులు వారు కోటర్ పై 20 రూపాయలు ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు మొత్తం కలిపితే ఒక కోటర్ కి 40 ఫుల్ బాటిల్ పై 160 రూపాయలు ఒక వ్యక్తి ఎంత లాస్ అవుతున్నారో ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు దృష్టి పెట్టి మందు బాబులకు న్యాయం చేయగలరు బినామీ పేర్లతో షాప్ నడిపిస్తున్న యజమానులు షాపు వచ్చిన వారికి 15 లక్షలు ఇవ్వాలి లేనిపక్షంలో ఈ సమస్యపై ఎక్సైజ్ సూపర్డెంట్ కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం ధరను నిర్ణయించడం జరిగింది కానీ ఇక్కడ అది జరగడం లేదని ఆయన తెలిపారు.ప్రతి ఒక వస్తువుని రేటు చూసి కొంటాం కానీ ప్రజలు మందు విషయంలో ఎందుకు అడగలేక పోతున్నారు, ప్రశ్నించండి అప్పుడే న్యాయం జరుగుతుంది అని ఆయన ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి రిటైల్ షాపును బంద్ చేసి ఎమ్మార్పీ ధరలకు మద్యం అందుబాటులో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.