
SI Kranti Kumar Patil
సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా..! సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేయండి
◆:- ఏడు మొబైల్స్ రికవరీ… బాధితులకు
అందజేత
◆:- సేవలను సద్వినియోగం చేసుకోవాలి
◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఝరాసంగం మండల్ పరిధిలోని సెల్ ఫోన్ బాదితులకు రికవరీ చేసిన 7 ఫోన్ లను అందజేయడం జరిగింది అని ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన “మొబైల్ రికవరీ మేళ” కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరిగింది అన్నారు.
మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని ఈ రోజుల్లో, మన యొక్క రహస్య సమాచారమైన బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన సైబర్ నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) ను 17-మే-2023లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎసఐ వివరించారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
మండల్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు, దొంగిలించిన ఫోన్లను, మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగిలించబడిన ఫోన్ అని తెలియక, కొనుగోలు చేసిన అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారు అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, బెట్టింగ్ యాప్స్ మాటున సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని గుర్తించాలని, ఆన్లైన్ బెట్టింగ్ ఆడినా, ప్రమోట్ చేసినా, అట్టి వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అని, కస్టమ్స్ అధికారినని, వీడియో కాల్స్ చేస్తే నమ్మరాదని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింకు లను ఓపెన్ చేసి సైబర్ నెరగాళ్లు పన్నిన ఉచ్చులో పడకూడదని అన్నారు. ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930కు కాల్ చేసి గాని, సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ప్రజలకు ఎస్ఐ సూచించారు. ఈ స్పెషల్ టీమ్స్ సైబర్ సెల్ టెక్నికల్ అసిస్టెంట్, ఐటి సెల్ సిబ్బంది సాయి భరత్ కీలకంగా వ్యవహరించారని ఎస్ఐ అభినందించారు.