35-Year-Old Techie’s Emotional Post After Job Loss Goes Viral
ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన
35 ఏళ్ల వయసులో జాబ్ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయానంటూ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. అతడి పరిస్థితి అనేక మందిని కదిలించింది.
తాను చాలా కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్టు ఆయన తెలిపారు. జాబ్ స్థిరత్వం ఏదోక రోజు వస్తుందనే భావనలోనే చాలా ఏళ్లు గడిచిపోయాయని అన్నారు. కానీ అది ఎన్నటికీ సాకారం కాని కలగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పనితీరు మెరుగ్గానే ఉన్నా లేఆఫ్స్‌కు గురయ్యానని, కంపెనీలో ఖర్చుల తగ్గింపు, పునర్వ్యవస్థీకరణ కారణంగా జాబ్ కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు.
