Lost Mobile Recovered by Chityala Police
పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.
చిట్యాల, నేటిదాత్రి
చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
