
"Ganesh Shines in Deepotsavam"
దీపాల కాంతుల్లో వెలిగిన గణనాథుడు
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి యాపల్లోని శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనిలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో దీపాలను తీసుకువచ్చి గణనాథుని ముందు అలంకరించి వేల సంకలో దీపాల వెలుగుల్లో గణనాధుని చూడాలని మండపం ముందు శివలింగాన్ని రూపుదిద్ది ఓంకారాన్ని, స్వస్తిక్ రూపాన్ని ముంగిట అలంకరించి వాటిపైన దీపాలు అలంకరించి మహిళా భక్తులు వారి యొక్క భక్తిని గణనాథునికి
సమర్పించుకున్నారు ముజేకాలు ఏలే ఆ గణనాథుడికి ఎన్ని చేసినా మాకు తనివి తీరదు అని పాటలు పాడుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇట్టి అదృష్టం మాకు లభించడం ఆ గణనాథుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ దీపాలతో భక్తి పాటలు పాటలు పాడుకుంటూ దీపాలతో వినాయకుడికి హారతి పట్టారు
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తిని కూడా చాటుకున్నారు.
ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.