
రామకృష్ణాపూర్, జనవరి 06, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అయ్యప్ప స్వామి భక్తులు నియమ నిబంధనలతో ఉపవాసాలు ఉంటూ 41 రోజుల పాటు కటోర దీక్షలును చేపట్టారు. వారు చేపట్టిన అయ్యప్ప దీక్షలు 41రోజులు ముగియడంతో శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో చంద్రగిరి లక్ష్మణ్, నల్లగొండ నర్సింగ్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వాములకు, భక్తులకు వేదాంతం పురుషోత్తమ చార్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రచార కార్యదర్శి దండు సదానందం, కమిటీ సభ్యులు చిలుముల గౌతం, జాడి సతీష్,పిల్లి మణి కుమార్, సురేందర్ గురు స్వాములు వెంకన్న, లంక రామస్వామి, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.