
Local Election Buzz
ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…
◆:- ఆశ్చర్యపోతున్న ఓటర్లు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

కూడగట్టుకుంటున్న మద్దతు
సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో
కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు
నేతల చుట్టూ చెక్కర్లు.
సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.

ఓటరు జాబితా ప్రచురణ
ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.