రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రేండ్ల సంజీవ్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి భార్య రాధ(32సం.లు) బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరికి కనీసం ఉండటానికి ఇల్లు లేక ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూంలో ఎలాంటి వసతులు లేని ఇంటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అసలే దినసరి కూలీ పనిచేసి బతుకీడుస్తున్న కుటుంబాన్ని విధి వక్రీకరించింది. కుటుంబ యజమాని సంజీవ్ క్యాన్సర్ బారిన పడడం, ఉన్న కాస్తోకూస్తో పిల్లల చదువుల నిమిత్తం ఉంచిన డబ్బులు మొత్తం వైద్యానికి సరిపోకపోవడంతో తనికి ఇంట్లోనే ఉంచి సపర్యలు చేస్తూన్నారు. ఇద్దరు పిల్లలు పదవ తరగతి వరకు చదివుకోనసాగించి పైతరగతులకు చదవడానికి కావలసిన ఆర్థిక స్తోమత లేక చదువుకి విరామం ప్రకటించారు. కుమారుడైన రాజ్ కుమార్ (20సం.లు) కులవృత్తి చేసుకుంటూ రోజువారి కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో రోజులు గడిచే పరిస్థితి నెలకొన్నది. కుమార్తె అక్షయ(17సం.లు) తండ్రికి సపర్యలు చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆకుటుంబానికి ఏదిక్కు లేక పోవడంతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆకుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మిగతా వివరాలకు 9989472184 నంబర్ కి సంప్రదించాలని కోరారు.