– పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత
– శిథిలావస్థలో పాఠశాల భవనాలు
– చెట్ల కిందనే చదువులు
– పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే
– ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం
– ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవేని రంజిత్ డిమాండ్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవేని రంజిత్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడం లేదన్నారు. అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని కొన్ని పాఠశాలలో తరగతి గదులు సరిపోక చెట్ల కిందనే చదువుకుంటున్నారని తెలిపారు. అనేక సమస్యలతో సమస్యల వలయంగా మారిన ప్రభుత్వ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, శశాంక్, సాయి అరవింద్, సాయికిరణ్, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.