కబ్జాకు గురవుతున్న చెత్త కుండీ, అధికారులు వారించిన లెక్కచేయని కబ్జాదారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం జనవరి 10: అధికారులు అడ్డుచెప్పిన లెక్కచేయకుండా చెత్త కుండీని కబ్జా చేస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెత్త కుండీని కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానిక ప్రజానీకం అంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో గల ఆటో స్టాండ్ నుండి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త కుండీని గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసి అ స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్ననికి గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచ్, స్థానికులు అడ్డుచెప్పినప్పటికి డౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోని చెత్త కుండీని కబ్జాదారు నుండి కాపాడాలని అంటున్నారు.
