Sugar Factory Reopens in Zaheerabad
పునః ప్రారంభమైన స్థానిక చక్కెర పరిశ్రమ
◆-: రైతులకు మంచి మద్దత్తు ధర కల్పిస్తాం
◆-: సాగర్ బత్రే ఓంకార్ చక్కర పరిశ్రమ యజమాని
◆- సంతోషం వ్యక్తం చేసిన రైతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, మార్చి 12: జహీరాబాద్ ప్రాంత రైతులకు ముఖ్య ఆధారంగా ఉన్న చక్కెర కర్మాగారం మళ్లీ ప్రారంభం కానుండడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలో ఉన్న చక్కెర పరిశ్రమలో మరమత్తులు చేసి గురువారం పూజలు నిర్వహించారు. ఓంకార్ సాఖర్ కార్ఖాన ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ నంబర్ 17 పేరుతో పరిశ్రమ యజమానులు గ్రామ సర్పంచ్ ప్రతినిధి మల్లికార్జున్, గ్రామ కార్యదర్శి సంగారెడ్డి, గ్రామ ఆయా పార్టీల నాయకులు, నర్సింహారెడ్డి, ధర్మేందర్, బాబు, రైతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఎద్దుల బండ్లపై తెచ్చిన చేరుకును క్రసింగ్ కొరకు ట్రయల్ చేశారు. పరిశ్రమ ప్రాంగణంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యజమాని బోత్రే సాగర్ మాట్లాడుతూ చక్కెర కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, స్థానిక జహీరాబాద్ ప్రాంతంలో పండించే చేరుకును రైతుల మద్దతుతో మొత్తం క్రసింగ్ చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. మిగతా చక్కెర పరిశ్రమలు ఇచ్చే చెరుకు మద్దతు ధర కంటే అధికంగా ఇచ్చి రైతుల ను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కొందరు రైతులు మాట్లాడుతూ, మూతపడ్డ చెరుకు పరిశ్రమ మళ్ళీ గానుగ ఆడించడానికి సిద్ధం కావడంతో తమ గుండెల్లో ఆనందం నిండిందని అన్నారు. చెరుకు పరిశ్రమ మళ్ళీ ప్రారంభం కావడంతో ఇక్కడి ప్రాంతానికి కళ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమ వైస్ చైర్మన్ సాగర్ మార్తాండే, ఆఫ్రోజ్ పటేల్, కొత్తూరు సర్పంచ్ ప్రతినిధి మల్లికార్జున్, దిడిగి సర్పంచ్ ప్రతినిధి సోమప్ప, ఉప సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నర్సింలు, సిడిసి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
