
Education
మండల కేంద్రంలో స్థానిక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మిస్ చార్జీలు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ
మంగపేట:- నేటి ధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సర్వేలు చేయడం జరిగింది విద్యారంగ సమస్యలపై ఈ సర్వేలో భాగంగా జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ఎం ఆర్ ఓ ఆఫీస్ వరకు ర్యాలీ మండల కమిటీ మండల ఉపాధ్యక్షులు చందు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ హాజరైన మాట్లాడుతూ జాయింట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వినతి పత్రం అందజేసి అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మండల వ్యాప్తంగా ప్రభుత్వ బడులలో పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ టీచర్, లేనటువంటి పరిస్థితి నెలకొంది అదేవిధంగా హాస్టల్లో మిస్ చార్జీలు విడుదల కాక విద్యార్థులకు పౌష్టికాహారం అందలేక బలహీన అవుతున్నారని పూర్తిస్థాయిలో తరగతి గదిలో ఫ్యాన్లు బెంచీలు కాంపౌండ్ వాల్ త్రాగునీరు సమస్య అదే విధంగా మెనూ ప్రకారంగా భోజనం హాస్టల్లో పెట్టడం లేదని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఇలా అయితే విద్యార్థులకు విష జ్వరాలు గజ్జి తామర లాంటివి అచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , రాష్ట్రవ్యాప్తంగా 9000 కోట్ల స్కాలర్షిప్ విడుదల కాక పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని పూర్తిస్థాయిలో విద్య చదవలేక పోతున్నారు అదే క్రమంలో స్కూలు విద్యార్థులు కళాశాల విద్యార్థులు వారి యొక్క గ్రామం నుంచి వచ్చే క్రమంలో ఇసుక లారీలు ఇబ్బందికరంగా రోడ్లపై ఉన్నాయని దీనిపై అధికారులు విచారణ జరపాలి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు కళాశాల విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోకిల బాలిశ్వర్, సహకారదర్శి మధులత, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, కిరణ్
వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు