Local Body Election Notification Released
స్థానిక సంస్థల..”ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల”..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ఐకెపి (ఇందిరా క్రాంతి పథకం) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఈ నెల 5 వరకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి అవకాశం..!
