
LOC Handed Over to Patient
బాధితురాలికి ఎల్ఓసి అందజేత
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ న్యాల్కల్ మండలం చాల్కి గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌసియా బేగం, C/O మొహమ్మద్ మహాబూబ్ అనారోగ్య సమస్య రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.చికిత్స నిమిత్తం (250,000 /-)
రెండు లక్షల యాభై వేల రూపాయలుఖర్చు వస్తుంది అని వైద్యులు తెలుపడంతో బాధితురాలికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సంప్రదించగా తక్షణమే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ మరియు రోడ్లు&భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాకారంతో బాధితురాలు మొహమ్మద్ గౌసియా బేగం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద (250,000 /-)రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి ని విడుదల చేయించారు,ఈ ఎల్ఓసి ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడు మొహమ్మద్ గౌసియా బేగం, C/O మొహమ్మద్ మహాబూబ్ కుటుంబ సభ్యులకు కీ అందించారు.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మాజీ వైస్ యం.పి.పి.రాములు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సీనియర్ నాయకులు భీమయ్య,వెంకట్ రెడ్డి, అశ్విన్ పాటిల్,ప్రతాప్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.