
MLA Mynampally Rohit Rau.
ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి అందజేత
• కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రౌవు సహకారంతో 2,50,000 ఎల్ఓసి అందజేయడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మనుబోతు మైసవ్వ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 2 లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును కాంగ్రెస్ నాయకులు జేల్లా లక్ష్మణ్ కుటుంబ సభ్యులు రాజుకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ఓసికి సహకరించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కు, మైనంపల్లి హనుమంతరావుకు ఎల్లవేళల రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, రాములు, నరేష్ పాల్గొన్నారు