*చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం….
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 33 కోట్లు రూపాయలు రుణమాఫీ …
* కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల చేనేత కార్మికులు ….
* రాజన్న సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )
గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జీవో నెంబర్ 56 లో భాగంగా 1-4-2017 నుండి 31-3-2024 తీసుకున్నటువంటి చేనేత రుణమాఫీని మాఫీ చేయడం జరిగినది. తెలంగాణ మొత్తంలో 33 కోట్లు రుణమాఫీ చేయడం జరిగినది అంతేకాకుండా ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న రుణం వచ్చేసి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం ద్వారా చేనేత కార్మికులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. మన సీఎం రేవంత్ అన్న గారికి, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు అన్నగారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శీనన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ గారైన కేకే మహేందర్ అన్నగారికి రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున కామూరి వనిత, నలినీకాంత్ మరియు చేనేత మహిళా కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.