తెలుగు సాహిత్యానికి ఆదికవి పాల్కురికి సోమనాథుడు
తెలుగు సాహిత్యాన్ని మర్చిపోకుండా చిరస్మరణీయం చేసిన ఘనత పాల్కురికి సోమనాథుడిది
పాలకుర్తి ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసమే లేదు
జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథం సోమనాథుడి జన్మస్థలం లో ఆవిష్కరించడం చారిత్రక విశేషం
ప్రముఖ కవి, రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి
పాల్కురికి సోమనాథ స్మ్రతి వనంలో జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంధావిష్కరణ
పాలకుర్తి, నేటిధాత్రి:-
ప్రముఖ కవి, రచయిత చరిత్ర పరిశోధకులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర రాసిన
జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథం భావితరాలకు దిక్సూచి అని ప్రముఖ కవి, రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం సోమనాథుడి జన్మస్థలం పాలకుర్తి లోని దేవస్థానం ప్రాంగణంలోని పాల్కురికి సోమనాథ స్మ్రతి వనంలో
కవి, రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర రాసిన జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంధావిష్కరణ కార్యక్రమం
సోమనాథ కళాపీఠం అద్యక్షులు రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన
ఏర్పాటు చేయగా నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథావిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ
సాహిత్య వికాసానికి ఏర్పడిన
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా సాహిత్య చరిత్ర ను గ్రంథ రూపంలో ప్రచురించే మహత్తర కార్యాన్ని రామచంద్ర దిగ్విజయంగా పూర్తిచేశారని అన్నారు. పాల్కురికి సోమనాథుడి జన్నస్ధలం అయిన పాలకుర్తి సోమనాథ స్మ్రతి వనంలో జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరణ చేసుకోవడం చారిత్రక విశేషం అని తెలిపారు. తొలి తెలుగు స్వతంత్ర కవి, తెలుగు సాహిత్యానికి ఆదికవి పాల్కురికి సోమనాథుడని అన్నారు.తెలుగు సాహిత్యాన్ని మర్చిపోకుండా చిరస్మరణీయం చేసిన ఘనత పాల్కురికి సోమనాథుడిదని అన్నారు.
పాలకుర్తి సోమనాథుడని, వీర, విప్లవ, ఉద్యమ కవి గా
తెలుగు సాహిత్యాన్ని మర్చిపోకుండా చిరస్మరణీయం చేసిన ఘనత పాల్కురికి సోమనాథుడిదేనని అన్నారు.
పాలకుర్తి ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసమే లేదని అన్నారు.
గ్రంథ రచయిత డాక్టర్ లింగంపల్లి రామచంద్ర మాట్లాడుతూ 1970 వ దశాబ్ద కాలంలో జనధర్మ వార పత్రిక సంపాదకులు ఎం, ఎస్ ఆచార్య ప్రోద్బలంతో జనగామ జిల్లా సాహితీ వేత్తల పరిచయాలు రాసే అవకాశం కలిగిందని దానికి కొనసాగింపుగే ఈ గ్రంథం అని అన్నారు. జనగామ జిల్లా సాహిత్య చరిత్ర రచనలతో ఒక పరిపూర్ణత సిద్ధించిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథం అంకితం తీసుకున్న ఆర్,వి శ్రీనివాసరావు దంపతులు, పానుగంటి రామమూర్తి, ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్, పాండురంగారావు, బండిరాజుల శంకర్, పిట్లోజు సోమేశ్వర చారి, అలిశెట్టి ప్రభాకర్, సోమనాథ కళాపీఠం సభ్యులు వీరమనేని వెంకటేశ్వరరావు, ఇమ్మడి దామోదర్, రాపాక విజయ్, మామిండ్ల రమేష్ రాజా, బజ్జూరి వేణుగోపాల్, గూడూరు లెనిన్ ,సుదర్శన్ సోమయ్య, జనగామ జిల్లా వివిధ మండలాల కవులు సాహితీవేత్తలు సాంబరాజు యాదగిరి, ఐల సోమ నరసయ్య చారి, రెడ్డి రత్నాకర్ రెడ్డి, నక్క సురేష్, అనంతోజు బ్రహ్మచారి, వేముల సదానందం, ఎక్కల దేవి మోహనకృష్ణ, అంకాల సోమయ్య, చింత ప్రసాద్,చింత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.