Anganwadi Center Literacy Program in Chityal
అంగన్వాడీ కేంద్రం లోపిల్ల లకు అక్షరాభ్యసo.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం లోని శాంతినగర్ లో మంగళవారం రోజున రజిత టీచర్ అంగన్వాడీ కేంద్రం లో చిట్యాల సెక్టార్ సమావేశం కు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో తుమ్మల అనిల్ తేజ దంపతుల కూతురు అను అనే బాలికకు అక్షరాబ్యాసం చేయించి పిల్లలతో టీచర్స్ అందరూ కలిసి ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఆట పాట పిల్లలతో చేయించడం మరియు ఎజెండా అంశాలను చదివి వినిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 మంది అంగన్వాడీ టీచర్స్ ఆయా కోమల పాల్గొన్నారు.
