సేవ కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ గోపాలరావుపేట
కరీంనగర్, నేటిధాత్రి:
లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్ కోదండరాములు కరీంనగర్ వారు లయన్స్ క్లబ్ గోపాలరావుపేటను సందర్శించిన సందర్భంగా గోపాలరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు నలభై వేల రూపాయల విలువైన వాటర్ కూలర్, అంగవాడి సెంటర్-1 కు ఐదు వేల విలువైన ఫ్యాన్, విద్యార్థులకు డ్రెస్ లు, గ్రామ పంచాయతీ సిబ్బందికి బ్లాంకెట్స్ పంపిణీ చేసిన అనంతరం వెంకటేశ్వర ఆలయంలో రెండు సిమెంట్ బెంచీలను వేయించడం జరిగింది. ఈకార్యక్రమంలో జిల్లా కోశాధికారి గాలిపెల్లి వెంకట్, జిల్లా నాయకులు నారాయణ రావు, రమేష్, రీజియన్ చైర్మన్ జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల మోహన్, కోశాధికారి గొడుగు అంజియాదవ్, మాజీ జోన్ చైర్మన్ లు కర్ర శ్యాం సుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, డైరెకర్స్ కర్ర రాజిరెడ్డి, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, వోడ్నాల శ్రీనివాస్, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, మచ్చ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
