కుప్పానగర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం…

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-8.wav?_=1

 

కుప్పానగర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : ఝరాసంగం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన బేగరి ఉషమ్మ (65), భర్త సంగప్ప, గురువారం (15-01-2026) ఉదయం 10:30 గంటల నుండి అదృశ్యమయ్యారని ఆమె కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ఉషమ్మ తిరిగి ఇంటికి రాలేదని అన్నారు. అనంతరం బంధువులు, పరిచయస్తులను సంప్రదించగా ఆమె ఎవరి ఇంటికీ రాలేదని తెలిసిందన్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఉషమ్మను గుర్తించినట్లయితే లేదా ఆమె ఆచూకీ తెలిసినట్లయితే 9912519657 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version