రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరుని తండా గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి ప్రధాన రహదారి లింకు cc రోడ్డు పనులను సోమవారం వీరుని తండా సర్పంచ్ గూగుల్ మీనా మోహన్ ఉప సర్పంచ్ రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగావత్ తిరుపతి తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితోనే ఉమ్మడి మానాల గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని, ఆయన తన సొంత గ్రామంగా గిరిజన గ్రామాలను అభివృద్ధికి పార్టీలకతీతంగా చేస్తున్నారని తండాలో 100% సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేశారని అన్నారుఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రాజారామ్ ,లక్కాకుల రమేష్, నాయని రాజేశం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.