మొగుళ్ళపల్లి నేటి దాత్రి
ఆపదొస్తే అండగా ఉండి..ఆపద్బాంధవుడిలా ఆదుకునే..మనసున్న మహానేత పోలినేని లింగారావు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని నర్సమ్మ-నాగేశ్వర్ రావు దంపతులకు జనవరి 1, డిసెంబర్ 12, 1966న 3వ సంతానంగా జన్మించిన పోలినేని లింగారావు విద్యార్థి దశలో 1986లో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎన్ ఎస్ యు ఐ లో చేరి, ఎన్ ఎస్ యు ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ గా పోలినేని లింగారావు నియమితులయ్యారు. తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు ఆపదొస్తే అండగా ఉండే ఆపద్బాంధవుడిలా కాపాడుకుంటూ..నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ..ప్రజాసేవకై పరితపించే నిస్వార్థ సేవకుడు పోలినేని లింగారావు ప్రస్తుతం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న నేతృత్వంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించారు.