
ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామ సభలో కమిటీని ఎన్నుకోవాలి
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘీస్తూ ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం దారుణం ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
ప్రభుత్వం వివిధ సంక్షేమపథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలను గ్రామ సభలో ఎన్నుకోవాలని నిబంధనలు చెప్తున్నా,పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు వారి కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటిల్లో అవకాశం కల్పిస్తూన్నారు.కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం మూలంగా సంక్షేమ పథకాల్లో పారదర్శకత లోపిస్తుందని, కేవలం వారికి అనుకూలంగా ఉన్నవారికీ మాత్రమే ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇప్పటికే ఏర్పాటుచేసిన కమిటీలు రద్దు చేసి, నూతన కమిటీ లను గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటి సభ్యులను ఎన్నుకోవాలని ఆయన కోరారు..