కాంట్రాక్ట్ కార్మికులకు. 5000 బోనస్. సీఎం రేవంత్ రెడ్డి. మరియు బలరాం నాయక్. ప్రకటించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గూడెల్లి యాకయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతం ఎన్నడూ లేని విధంగా సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ ఏర్పడ్డప్పుడు నుండి కూడా ప్రకటించని లాభాల వాటాలలో కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా ఎంతో కొంత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ప్రతి సింగరేణి కాంటాక్ట్ కార్మికునికి 5000 రూపాయలు చొప్పున దసరా పండుగకు ముందే ఇవ్వాలని 12 కోట్ల 50 లక్షలు రూపాయలు ఇస్తున్నందుకు కాంట్రాక్ట్ కార్మికులు సంతోషాన్ని వెల్లబుచ్చుతూ ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి సంస్థ సీ ఎం డీ బలరాం నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మడిపల్లి కరుణాకర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతో కొంత లాభాల వాటాలలో ఇవ్వాలని ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చామన్నారు 5000 రూపాయలు ప్రకటించడంపై సంతోషాన్ని వెళ్ళబుచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సరియైన జీతాలు లేక నానా వస్తువులు పడుతున్నారని వారి ఇబ్బందులను గుర్తించి 22 జీవో అమలు చేసి తక్షణమే వారికి జీతాలు పెంచాలని వచ్చే దీపావళికి అడ్వాన్స్ కూడా ఇప్పించాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ సిఎండి బలరాంకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులకు జై సింగరేణి జై జై సింగరేణి అంటూ నినాదాలు చేస్తూ వారి యొక్క చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో అనిల్ షకీల్ పాషా హనుమంతు ప్రసాద్ చిట్టి బాబు విజయ్ ఓదెలు ఇబ్రహీం రవి లతా కనక సుల్తానా తదితరులు పాల్గొన్నారు