గుండెపోటుకు బలైన భర్త..
అనారోగ్యంతో చిన్న కొడుకు మృతిచెందాడు.
కరెంటు షాక్ తో జీవశ్చవంలా మారిన పెద్ద కొడుకు..
బతుకు బండి మోయలేక కన్నీటి పర్యంతం..
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
విధి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది… కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద దిక్కు గుండెపోటుకు బలైతే… బరువెక్కిన గుండెతో ఆ తల్లి కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుండగా.. అనారోగ్యం రూపంలో చిన్న కొడుకు దూరమయ్యాడు… అంతే ఒక్కసారిగా ఆ తల్లి గుండె బద్దలైంది.. బతుకు భారమైంది… ఉన్న కొడుకును చూసుకుంటూ కాలం వెళ్ళదీస్తుండగా… విధి మరోసారి కాటు వేసింది… పెద్ద కొడుకు పెయింటింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ రూపంలో అతన్ని జీవశ్చవంలా మార్చింది… చేయి తెగిపోయి మంచానపడ్డ కొడుకుని సాకలేక.. ఆ తల్లి గుండె అలసిపోతుంది… ఉండడానికి గూడు లేక… బతకడానికి కూడు లేక.. బతుకు బండిని ఎలా లాగాలో తెలియక ‘భారతి’ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది…. వివరాల్లోకి వెళ్తే…. రామాయంపేట పట్టణానికి చెందిన పెంట మీద సందీప్ అనే యువకుడు తండ్రి స్వామీ గుండెపోటుతో మృతి చెందగా తమ్ముడు నవీన్ అనారోగ్యంతో మరణించాడు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో కిరాయికి ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు కన్నతల్లి భారతిని పోషించడానికి సందీప్ పెయింటింగ్ కూలి పనులు చేయడానికి బీసీ కాలనీలో అక్టోబర్ 27న పెయింటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి దావా పైనుండి క్రిందపడి కుడి చేయి కాలిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు వైద్యం కోసం డబ్బులు లేక కన్నతల్లి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయాలని స్థానిక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ను తమను ఆదుకోవాలని కన్నతల్లి వేడుకుంటూ అపర్ణ హస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ తల్లి దీనగాధా