
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది – తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం
కరీంనగర్, నేటిధాత్రి:
మానవ జీవితం దేవుడిచ్చిన వరమని, క్షణికావేశంతో అంతం చేసుకోవద్దని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం తెలిపారు.
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం వారోత్సవాల్లో భాగంగా రేకుర్తిలోని డిఫెన్స్ అకాడమీలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎజ్రా మల్లేశం హాజరై మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైతాయని వాటిని సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షణకాల ఆవేశంతో చాలా మంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని, దీంతో వారి కుటుంబం ఎంతో ఇబ్బందులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం ఒత్తిడితో క్షణావేశానికి గురైతనువుచాలిస్తున్నారని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం కచ్చితంగా ఉందని విలువైన జీవితాన్ని అంతం చేసుకోవద్దని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలబై సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి ఏటా ఏడు లక్షల మంది తమ జీవితాలను అర్ధాంతంగా అంతం చేసుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడే వారు ఎక్కువ శాతం 15 నుంచి 29 సంవత్సరాల వయసు కావడం ఎంతో బాధాకరమైన విషయమని, ఒత్తిడి, అశాంతి, అభద్రతా భావం, నిరాశ నిస్పృహలు, ఓటమి అవమానం, ప్రేమలో వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఒంటరితనం, ఉద్యోగంలో రాణించకపోవడం తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఆత్మహత్యలను నివారించడం అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు నివారణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడే వారి ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతుందన్నారు. స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండకపోవడం, ఒంటరిగా ఉండడం, నిద్రలేమి లేక అధిక నిద్ర, భయం ఆందోళన అభద్రతాభావం సరిగా తినకపోవడంతో పాటు ఏవిషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడం తదితర మార్పులు కనబడినప్పుడు వారిని సైకాలజిస్ట్ వద్దకు గాని సైకియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ముందుగా గుర్తిస్తే ఎనబై శాతం మంది ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడగలిగిన వారు అవుతామన్నారు. సంఘం ఉపాధ్యక్షులు, అలియాన్స్ క్లబ్ గవర్నర్ గాలిపెల్లి నాగేశ్వర్ మాట్లాడుతూ చాలామంది పరువు కోసం ప్రాక్లాడుతూ ప్రాణాలు వీక్ తెచ్చుకుంటున్నారని అన్నారు.. ఆత్మహత్యలను నివారించడానికి ప్రతి ఒక్కరు మరొకరు చర్చించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మహత్యలకు పాల్పడమని అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.. ఈకార్యక్రమంలో అకాడమీ కరస్పాండెంట్ మునీందర్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.