Life Insurance Ensures Family Security
భవిష్యత్ భద్రత కోసం జీవన భీమా తప్పనిసరి
– ఎస్. బి . ఐ లైఫ్ శాఖ అభివృద్ధి అధికారి మంత్రి రాంప్రసాద్, ఏజెంట్ వలుస చంద్రశేఖర్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
గర్షకుర్తి గ్రామానికి చెందిన యువకుడు కొండి శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కొండి శ్రీనివాస్ ఎస్. బి . ఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో స్మార్ట్ స్కాలర్ అనే పాలసీ తీసుకోవడం జరిగిందని, ఈ పాలసీకి గాను రెండు సంవత్సరాల ప్రీమియం చెల్లించడం జరిగిందని, ఆక్సిడెంట్ జరగడం వల్ల అతని కుటుంబానికి 20 లక్షల భీమా సొమ్ము వెంటనే అందించడం జరిగిందన్నారు. అతను కట్టవలసిన మూడు కిస్తీలను ఎస్.బి. ఐ లైఫ్ కంపెనీ చెల్లిస్తుందని, తద్వారా 25వ సంవత్సరం నాడు పాపకు మెచ్యూరిటీ అమౌంట్ అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్. బి . ఐ లైఫ్ శాఖ అభివృద్ధి అధికారి మంత్రి రాంప్రసాద్, ఏజెంట్ వలుస చంద్రశేఖర్ ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. వారు బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి అధికారి మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ “ప్రతీ ఒక్కరూ భవిష్యత్ భద్రత కోసం జీవన భీమా తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఇలాంటి పథకాలు కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలుస్తాయని అన్నారు. ఆకస్మిక మరణం, అనారోగ్యం లేదా ప్రమాదం వంటి సందర్భాల్లో ఈ భీమా ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. అలాగే ఏజెంట్ వలుస చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సహాయం ద్వారా కొండి శ్రీనివాస్ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా లభించిందనీ అన్నారు. గ్రామీణ ప్రజలు కూడా భీమా పథకాలపై అవగాహన పెంచుకుని, తమ కుటుంబ భవిష్యత్‌ను సురక్షితం చేసుకోవాలని అన్నారు. భీమా చేయించుకోవడం వల్ల ఎప్పుడైనా జరిగే అనుకోని సంఘటనలలో కుటుంబానికి పెద్ద ఆర్థిక
అండగా ఉంటుందని పేర్కొన్నారు.
