
దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఏజెంట్లు
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, కార్మికవర్గాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సిఐటియు అనుబంధ సంస్థ ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఎల్ఐసి బ్రాంచ్ ఏజెంట్లు బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి అధ్యక్షతన సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ధర్నాలో ఎల్ఐసి ఏఓఐ వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్ గారు మరియు నర్సంపేట బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొనుగోటి సుధాకర్ రావు,గౌరవ అధ్యక్షులు ర్.చoద్రమౌళి,మర్ద గణేష్, నాయకులు కుసుంబ రఘుపతి, కుక్కల వేణు, నెల్లుట్ల అశోక్, నాంపల్లి రాంబాబు, పురాని రాంబాబు, శ్రీధర్ రాజు, సిఐటియు నాయకులు బిక్షపతి,రవీందర్,మల్లేష్,సతీష్, విక్రం, సారంగపాణి,వివేక్,మధుసూదన్,నరేందర్,తదితర ఎంప్లాయిస్ పాల్గొన్నారు.