పాఠశాల కు లైబ్రరీ బుక్స్,ర్యాక్ బహుకరణ
పాఠశాల అభివృద్ధికి గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం
కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మంద జయ
మరిపెడ నేటిధాత్రి
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్,పాఠశాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయం అని చిలంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మంద జయ,జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు శశిధర్ అన్నారు, తాను పనిచేస్తున్న పాఠశాలలో బడి బాటలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో సహ ఉపాధ్యాయుల సహకారంతో 32 మంది నూతన విద్యార్థుల ను పాఠశాలలో చేర్చడం తో ప్రస్తుతం 72 మంది విద్యార్థుల ను తీసుకురావడం జరిగిందని, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి గ్రామ పెద్దలను కలుస్తూ వారి ద్వారా పిల్లలకు అవసరమయ్యే సామాగ్రిని సమకూరుస్తున్నారు,ఈరోజు విద్యార్థుల రీడింగ్ కోసం లైబ్రరీ పుస్తకాలను భద్రపరచడానికి రిటైర్డ్ ఉపాధ్యాయులు రామసహాయం విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా ర్యాక్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పక్షాన విష్ణువర్ధన్ రెడ్డి కి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిల్లంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ,స్థానిక రాంపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ తో కలిసి మాట్లాడుతూ గుర్రం వెంకన్న గౌడ్ ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచించడం మరియు పిల్లల అవసరాల ను తీర్చడానికి వివిధ రకాల పద్ధతులు ఆలంబిస్తూ అందరినీ కలుస్తూ పాఠశాలల అభివృద్ధి పథంలో తీసుకపోవడం కోసం తన వంతు కృషి చేస్తున్నారు అని, ఇది ఎంతో మంచి శుభ పరిణామం అని రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని అభినందిస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు అందజేశారు,ఈ సందర్భంగా లైబ్రరీ బుక్స్ భద్రపరచడానికి విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ర్యాకును కాంప్లెక్స్ హెచ్ఎం జయ, హెచ్ఎం శశిధర్ చేతుల మీదుగా అందుకున్నారు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుండి మొదలుకొని ఇప్పటివరకు పిల్లల అవసరాలు తీర్చడానికి, పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు వెంకన్న ని తోటి ఉపాద్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు,
ధాత విష్ణువర్ధన్ రెడ్డి ని ప్రధానోపాధ్యాయులు వెంకన్న మరియు ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో చిల్లంచర్ల పాఠశాల గణిత ఉపాధ్యాయులు రాయిపెల్లి యాకయ్య,ప్రాధమిక పాఠశాల రాంపురం ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, రాజేశ్వరి,క్రాంతి మేడం, విద్యార్థుల తల్లిదండ్రులు,బందు పరశురాములు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు