రైతులకు వయ్యారిభామ నిర్మూలనపై అవగాహన
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వయ్యారిభామ కలుపు మొక్కల నిర్మూలన వారోత్సవాల సమావేశం ఏర్పాటు చేసారు, మహిళా వ్యవసాయ కళాశాల కరీంనగర్ రావెప్ విద్యార్థినులు రైతులకు వయ్యారిభామ కలుపు మొక్క నివారణపై, వయ్యారిభామ వలన మానవులకు, జంతువులకు, కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరియు పంటలకు కలిగే నష్టాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిఖిత , భాగ్యశ్రీ , పూజశ్రీ , దీపిక , అనిత ,అంజలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
