
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా. చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ మొత్తం స్వాతంత్రం ఒకసారి వస్తే మనకు మాత్రం నిజాం రజాకార్ల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వతంత్రం రావడం జరిగిందని అన్నారు, నిజాం రజాకార్లు తెలంగాణలో ఉన్నటువంటి మన ఆడ బిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడనివ్వడం జరిగిందని, ప్రజలను పన్నుల పేరుతో హింసించేవారని కనబడ్డ అటువంటి మహిళలను అత్యాచారాలు చేసే వాళ్లని ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా చంపేవారని అన్నారు, అలాంటి రజాకారులకు పాలన ఇప్పటికీ కూడా కొనసాగుతున్నదని అన్నారు,ఈకార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య .బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు గొర్రె శశి. మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు. శ్రీ పెళ్లి అనిల్ .జిల్లా మండల నాయకులు సుద్దాల వెంకన్న . గజల రవీందర్ .మండల మొగిలి. సుదగాని శ్రీనివాస్ .సుందర్ .అశోక్ చారి. మైదానం శ్రీకాంత్ .కెమ్సరపు ప్రభాకర్. వాళళ్ళ ప్రవీణ్. రాయని శ్రీనివాస్. పిట్టల నాగరాజు .చింతల రాజేందర్ చింతల రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.