సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు….అనంతరం
వారు మాట్లాడుతూ
కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు చేసుకోవడం అభినందనీయమని అన్నారు.
రాబోవుతరానికి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రశ్నించే గొంతులులుగా మారాలనీ అన్నారు.
యువత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆలోచనలు ముందుకు తీసుకపోతు వారి ఆశయ సాధనకు పాటుపడాలని అన్నారు.
మూడేండ్ల వయస్సులోనే తల్లిని కొలిపోయి ఉన్నత విద్యను పూర్తి చేశాడు.
చదువుతున్న వయస్సులో నుండే ఉద్యమాల్లో పాల్గొన్నాడనీ అన్నారు.
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనీ తెలిపారు.
నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్న మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ.
ప్రజా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అని అన్నారు.
సహకార సంఘాల గురించి ఆలోచించిన వ్యక్తి.
చేనేత వస్త్రాలను ప్రచారం చేసిన వ్యక్తి అని అన్నారు.
ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేసి, మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన గొప్ప త్యాగశిలీ అని కొనియాడారు.
రాజకీయ అణిచివేత, బడుగు బలహీనవర్గాలకు ఎదుగుదలకు దోహద పడిన వ్యక్తి.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన స్ఫూర్తితో నడుస్తుందనీ అన్నారు.
రాహుల్ గాంధీ తన పాదయాత్ర సమయంలో దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని తెలిపారు.
ఎవ్వరీ ఇస్సా ఎంత అని కులగణన జరగబోతోంది.
మొన్న అసెంబ్లీ సమావేశాలలో కుల గణన బిల్లు ప్రవేశ పెట్టామని అన్నారు..
ఆయన ఆచారాలను, ఆలోచనలు పాటిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు.
ఉత్చవ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా వేడుకలు జరుపుకోవాలనీ అన్నారు.
మార్కండేయ దేవాలయ పునః నిర్మాణంలో నా వంతు సహకారం ఉంటుందనీ తెలిపారు.
నేతన్నల వెంట ప్రజా ప్రభుత్వం ఉంటుందనీ అన్నారు.