
భద్రాచలం నేటిదాత్రి
భద్రాచలం నియోజకవర్గం లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని దుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దెదించి ప్రజా శ్రేయస్సును కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ దుమ్మగూడెం అధ్యక్షులులంక శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నుండి ఎంపీ గా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్‌ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనికోరి ప్రాదిస్తున్నాను భద్రాచలం నియోజకవర్గంలో గతం లోకాంగ్రెస్. పార్టీ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని పథకాలను నాశనం చేసి దేశాన్ని దివాలా తీసిన బీజేపీ, దుష్టపాలనను అంతమందించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు )