కార్మిక చట్టాలను రక్షించుకుందాం.

నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడుదాం.

సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి.

కాశిబుగ్గ నేటిధాత్రి.

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 23న బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది.అందులో భాగంగా సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీమాబాద్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ తోట ఎస్బిఐ బ్యాంకు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ పట్టుకొని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2019 సంవత్సరంలో వేతనాల కోడ్ ను,2020లో ఐ ఆర్ కోడ్ ను ఓ ఎన్ హెచ్ కోడ్ ను,సామాజిక భద్రత కోడ్ మొత్తము నాలుగు లేబర్ కోడ్ లను బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిందన్నారు. అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి,వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ,విదేశీ,స్వదేశీ పెట్టుబడుదారులకు, యాజమాన్లకు అనుకూలంగా చట్టాలను కట్టబెట్టే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తద్వారా కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రజాస్వామ్య బద్దంగా చర్చలు జరపకుండా యాజమాన్యాల కు కొమ్ముకాస్తు గత నాలుగు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేస్తూ, రెండుసార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగిన,సమరశీల ఉద్యమాలు జరిగిన కూడా బిజెపి ప్రభుత్వం కార్మికుల ప్రాణాలు,పోరాటాలను లెక్కచేయకుండా 2024 పార్లమెంట్లో ఎన్నికల సందర్భంలోనూ,వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా రద్దు చేయాలని వ్యతిరేకించినప్పటికీ కూడా బిజెపి పార్టీ కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి నిశ్చయించుకుందని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లను అమలు చేసేందుకు రూల్స్ తీసుకొచ్చిందని,కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. కార్మిక వర్గం హక్కులను ఉరితాల్లుగా మార్చే విధంగా బిజెపి ప్రభుత్వం కొనసాగించే దశలో ఉందని అన్నారు. మారిన లేబర్ కోడ్ లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం వ్యతిరేకిస్తూ 2024 సెప్టెంబర్ 23 న బ్లాక్ డే పాటించాలని కేంద్ర,కార్మిక సంఘాలు నిర్ణయించాలని, అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగిందని అన్నారు. అందుకోసమే మహిళా కార్మికులు హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం,తదితర అనేక ప్రాథమిక హక్కులను భంగం కలిగించే ఈ లేబర్ కోడ్ లను నిరసిస్తూ కార్మికులు వేలాది మంది పాల్గొని వీటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.
కార్మికులు హక్కుల కోసం 8 గంటల పని దినాల కోసం ప్రాణ త్యాగాలు చేసి, పోరాటాలు చేసి,హక్కులను సాధించుకుంటే ఈరోజు బిజెపి వాటిని కాలరాసి కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఒక పక్క భారతదేశంలో నిత్యవసరాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కార్మికులకు కనీస వేతనం పెంచకుండా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు.అందుకోసమే మనం బ్రతకడం కోసం కనీస వేతనాలు నెలకి 26 వేల రూపాయలు వేతనం కావాలనీ, కార్మిక హక్కులను రక్షించుకోవాలనీ,8 గంటల పని దినాలను అమలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!