అబద్దాలతో మీ ముందుకు వస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దు
శాయంపేట నేటి ధాత్రి:
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించి రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, శాయంపేట మండల కేంద్రంలో జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలోముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో ఆ పార్టీ చెప్పే అబద్ధాలకు మోసపోవద్దని కోరారు. మోదీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె, సిలిండర్లు, ఎరువులు, పప్పులు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. మోదీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వరంగల్ పార్లమెంట్ లో డాక్టర్ కడియం కావ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవా లని కోదారు.
పెద్దకోడెపాక గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి చేరికలు
పెద్దకోడెపాక గ్రామ బీఆర్ఎస్ నాయకులు పలువురు ఈరోజు కాంగ్రెస్ లోకి చేరారు. కాగా, వారికి ఎమ్మెల్యే జీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రేణుకుంట్ల పృథ్విరాజ్, మంద నరేష్, కుక్కల రాజు, కుక్కల సంతోష్ ఉన్నారు.