సింగరేణి స్థలం కబ్జాకు గురైతే చూస్తూ ఊరుకోం

సిఐటియు యూనియన్ పై అభండాలు వేస్తే తస్మాత్ జాగ్రత్త.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాంబారి వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి సంస్థలో పని చేసే కార్మికుల రక్షణకు,వారి హక్కులకై అహర్నిశలు పాటుపడుతున్న సిఐటియు యూనియన్ ను యూనియన్, నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాంబారి వెంకటస్వామి హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సాంబారి వెంకటస్వామి మాట్లాడుతూ… క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ఏరియాలో గల సింగరేణి క్వాటర్ SD 181 ను సింగరేణి యాజమాన్యం సిఐటియు కార్యాలయానికి కేటాయించిందని, క్వాటర్ పక్కన గల సింగరేణి స్థలాన్ని స్థానిక కౌన్సిలర్ భర్త స్థలాన్ని చదును చేసి అన్యాక్రాంతం చేసేందుకు కుట్రలు చూస్తున్నారని, కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న చెట్లను సైతం నరికి వేశారని, సింగరేణి స్థలాన్ని కబ్జాకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అట్టి సింగరేణి ఖాళీ స్థలంపై, క్వాటర్ లో ఉన్న సిఐటియు కార్యాలయం పై స్థానిక కౌన్సిలర్ భర్త కన్ను పడిందని కార్యాలయాన్ని ఖాళీ చేయించి పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు సైతం చేశాడని ఆరోపించారు. యూనియన్ ను తప్పు పట్టేలా వ్యాఖ్యానించడం సరైంది కాదని, కార్మిక,ప్రజా క్షేత్రంలో రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మునిసిపాలిటీ కార్యాలయం నుండి జెసిబి ని తెప్పించి సింగరేణి స్థలంలో ఉన్న చెట్లను తీయించడం సరి అయిన పద్ధతి కాదని అన్నారు. చెట్లను తీసివేసే క్రమంలో పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంకు సైతం పగిలిపోయి దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. ఇకనైనా స్థానిక కౌన్సిలర్ భర్త తన తీరును మార్చుకోవాలని లేనిపక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ ఉపాధ్యక్షులు వి ఐలయ్య, ఆర్గనైజర్ ఎన్ శ్రీధర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!