
శాయంపేట నేటి ధాత్రి;
భూపాలపల్లిలో జరిగే కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీపీమెతుకు తిరుపతిరెడ్డి కోరారు పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భూపాలపల్లి నియోజకవర్గంలో సభ శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వెనకాల 3 గంటల ప్రాంతంలో సభ జరుగుతుంది.కాబట్టి ప్రజలు సభకు వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి. కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో మారేపల్లి నందం గ్రామ ఉపసర్పంచ్ సుమన్, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, సామల నాగరాజు, అశోక్ ,లక్ష్మారెడ్డి, మహేందర్ , మోహన్ ,పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.