
Orugallu Maha Sabha
ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం
బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి
పరకాల నేటిధాత్రి
ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం అని పరకాల పట్టణ బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పిలుపునిచ్చారు.27న వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబి సైనికులు కదిలి రావాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరకాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి ప్రదాత ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహిస్తున్నారని ఆ సభకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.