
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం గణపురం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రఅంబేద్కర్ యువజన సంఘం పిలుపుమేరకు తేదీ 29,- 9 2024 రోజున జరగబోయే 48వ వార్షికోత్సవ సభ విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 1955 సంవత్సరంలో ఏర్పాటుచేసిన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1977 సెప్టెంబర్ 21న 2014లో తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కావున 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి కొత్త పాత సంఘాల అనుబంధ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులు గౌతమ బుద్ధ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నారాయణ గురు సాహు మహారాజ్ బీర్సా ముండా భాగ్యరాజు వర్మ ఫాతిమా గార్ల చరిత్రను యువజన బహుజనులకు చెప్పి వారిని చైతన్యం చేయాలని అవసరం కార్యకర్తలపై ఉన్నదని బహుజన రాజ్య స్థాపనకు ముందడుగు వేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం మండల అధ్యక్షుల సన్నాయిల వెంకటేష్ ములుగు జిల్లా ఎరుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ పాలకొండ భాస్కర్ చిలువేరు ఉదయాకర్ దూడపాక పున్నం మూల రఘు రెంటాల సదానందం కృష్ణ అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు