బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు
◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి
◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.